బాగా డబ్బున్న వాళ్ళ తాగుడు ఖర్చు రూ.50 వేల కోట్లు

download (4)బాగా డబ్బున్న వాళ్ళు ఆ డబ్బంతా దేనికి ఖర్చు పెడతారు? వాళ్ళు ప్రతి సంవత్సరం ‘మందు’కు పెట్టే ఖర్చు దాదాపు 50 వేల కోట్లు…అవును వాల్డ్ లో బాగా డబ్బున్న వాళ్ళు అందరూ కలిసి తాగడానికి 50 వేల కోట్ల డబ్బును ఖర్చు పెడతారని ఓ సర్వేలో తేలింది.

Wealth-X, UBS World Ultra Wealth కలిపి జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మందుతో పాటు ‘ట్రావెలింగ్’, ‘ఆటో మొబైల్స్ కొనడం’ వంటి వాటిపై భారీగా ఖర్చు పెడతారు. ఈ సర్వే ప్రకారం బాగా డబ్బున్న వాళ్ళు తాగడానికి రూ.49,200 కోట్లు, ట్రావెలింగ్  కు 2 లక్షల 76 వేల కోట్లు, కార్లు కొనడం పై 2 లక్షల 46 వేల కోట్లు ఖర్చు పెడతారట.

వాల్డ్ లోని మొత్తం లగ్జరీ వస్తువుల మార్కెట్ లో వీరి వాటా 19%. 2013 లో 17% గా ఉన్న వీరి వాటా ఈ ఇయర్ 2% పెరిగింది. రూ.185 కోట్లకు పైగా ఆస్తులున్న వారిపై ఈ సర్వే జరిపింది. ఈ కేటగిరీలోని ప్రతి వ్యక్తి సంవత్సరానికి రూ.6 కోట్ల 76 లక్షల లగ్జరీ షాపింగ్ చేస్తారని పేర్కొంది.

వాల్డ్ లో మొత్తం  2,11,275 మంది బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారని సర్వే జరిపిన సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. ఈ ఒక్క సంవత్సరంలోనే 12,040 మంది బాగా డబ్బున్నవారిగా మారారు. అయితే లగ్జరీ ఖర్చులతో పాటు విరాళాలు ఇవ్వడంలో కూడా ముందున్నారు ఈ రిచ్ పీపుల్. బాగా డబ్బున్న వాళ్ళలో దాదాపు సగం మంది తమ లైఫ్ టైంలో 6 కోట్ల వరకు దాన ధర్మాలకు ఇస్తున్నారని చెప్తోంది ఈ సర్వే.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy