బాగ్దాద్‌లో ఐఎస్ మారణహోమం: 48మంది మృతి

Iraqi security forces gather at the site of car bomb in New Baghdadఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాదులు మారణహోమం నిర్వహించారు. వేర్వేరు ప్రాంతాల్లో ఐఎస్‌ జరిపిన బాంబు దాడుల్లో ఇద్దరు సహా సుమారు 48 మంది ప్రాణాలు కోల్పోయారు. బాగ్దాద్‌లోని ఓ షాపింగ్ మాల్  ముందు ఐఎస్ టెర్రరిస్టులు కారు బాంబు పేల్చడంతో 18 మంది చనిపోయారు. మక్దాదియాలో మరో బాంబు దాడిలో 23 మంది చనిపోయారు. బాగ్ధాద్ సబర్బ్ లో పేలిన మరో బాంబు దాడిలో ఏడుగురు చనిపోయారు.

మరికొందరు ఉగ్రవాదులు షాపింగ్ మాల్ లో దాక్కోవడంతో భద్రతా బలగాలు భవనం పైనుంచి లోపలికి ప్రవేశించి టెర్రరిస్టులను కట్టడి చేశాయి. ఈ ప్రయత్నంలో నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు పోలీసులకు పట్టుబట్టారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఐఎస్‌ ప్రకటించింది. మొదట షాపింగ్ మాల్ బిల్డింగ్ లో 50 మందిని బందీలుగా ఉంచారని పోలీసులు భావించారు. అందులోకి ప్రవేశించిన తర్వాత ఎవరూ బందీలుగా లేరని గుర్తించారు. మరో ఘటనలో సౌతీస్ట్ బాగ్దాద్‌లోని రద్దీగా ఉండే మార్కెట్‌లో కారు బాంబు పేల్చడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకో ఘటనలో హోటల్‌ దగ్గర బాంబు దాడికి పాల్పడటంతో సుమారు 20 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy