బాటిల్ టవర్ గార్డెన్ కు భళే క్రేజ్..!

bottleపండ్ల తోట చూశాం. కూరగాయల తోటా చూశాం. కానీ సీసల తోట చూశారా ఎక్కడైనా? ఏంటీ? సీసల తోటనా అదెలా ఉంటుందంటారా? మీరు పక్కన ఫోటోలో చూస్తున్న తోట అదే… పనికిరాని పాత సీసాలతో ఓ అందమైన తోట. వావ్ ఐడియానే అద్భుతంగా ఉంది కదూ. ఫారిన్ లో బాటిల్ టవర్ గార్డెన్ అంటే ఇప్పుడు బోలెడంత క్రేజ్. బాటిల్ టవర్ గార్డెన్ చాలా సింపుల్. ఫస్ట్ బాటిల్స్ ను ఒకదానిపై మరొకటి అలా పేర్చుకుంటూ పోవాలి. ఆ తరువాత రెండు వరసలు పూర్తయ్యాక బాటిల్స్ లో నీళ్లు పోయాలి. పక్కపక్కనే ఎక్కువ వరసల్లో బాటిల్ టవర్స్ ఏర్పాటు చేసుకోవాలి. టవర్స్  పేర్చడం పూర్తయ్యాక బాటిల్స్ లో విత్తనాలు పెట్టాలి. కాస్తంత వాన పడితే చాలు విత్తనాలు పెరుగుతాయి, మొక్కలవుతాయి. అదీ ఎక్కువ రోజులు అక్కర్లేదు. జస్ట్ కొన్ని వారాలు అంతే. చాలా చిన్న జాగాలో అందమైన గార్డెన్ తయార్.

బాటిల్ టవర్ గార్డెన్ కు వాటర్, లైట్ రెండూ ఎంతో ఇంపార్టెంట్. బాటిల్స్ లో సీడ్స్ పెట్టిన తరువాత ఎప్పటికప్పుడు వాటర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. విత్తనాలకు నీరందుతుందో లేదో గమనిస్తుండాలి. ఇక లైట్ మరో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.  గార్డెన్ కు సరిపడ లైట్ అందుతుందా లేదా అనేది ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకోవాలి. బాటిల్ టవర్ గార్డెన్ తో  బోలెడన్ని లాభాలు. పర్యావరణానికి డేంజర్ గా మారిన ప్లాస్టిక్ అవసరమే ఉండదు. సో.. బాటిల్ టవర్ గార్డెన్ టోటల్ గా ఎకో ఫ్రెండ్లీ. గార్డెన్ కోసం పెద్దగా పైసలు కూడా కావు. చాలా తక్కువ ఖర్చుతోనే పూల తోటను తయారు చేసుకోవచ్చు. అంతేకాదు.. గార్డెన్ కోసం ఎకరాలకెకరాల స్థలం కూడా అక్కర్లేదు. ఇంకెందుకు ఆలస్యం.. పనికిరాని బాటిల్స్ తో పెరట్లో ఓ గార్డెన్ ను తయారు చేసుకోండి. అందమైన పూల మొక్కలనో కాదంటే కూరగాయాలనో  పెంచుకోండి. ఫ్రెష్ వెజిటబుల్స్ లాగించేయండి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy