బాధిత కుటుంబానికి ఓదార్పు : అభిమాని కుమారుడికి పవన్ నామకరణం

pavan1ఏపీ విశాఖ జిల్లా పాయకరావుపుటలో పర్యటించారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. జూన్ 5వ తేదీన పార్టీ ప్లెక్సీలు కడుతూ చనిపోయిన ఇద్దరు అభిమానుల ఇళ్లకు శుక్రవారం (జూన్-8) వెళ్లారు. భీమవరపు శివ కుటుంబ సభ్యులను పరామర్శించారు. విద్యుత్ షాక్ ఘటనలో చనిపోయిన శివ భార్యను ఓదార్చి తక్షణ సాయంగా 3 లక్షల రూపాయల చెక్కును అందించారు. తర్వాత వారి 3 నెలల బాబుకు అనిరుద్ అని పేరు పెట్టారు. కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పవన్ ను చూసేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు…

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy