బాపూజీ.. నువ్వే రావాలి… నీ సాయం కావలి

mahatma-gandhiసత్యం, ధర్మం, అహింస ఆయన ఆయుధాలు. అవే ఆయన నమ్మిన సిద్ధాంతాలు. అహింసాయుత పోరాటంతో రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యానికి చరమగీతం పాడారు. తెల్లదొరల పాలనలో బానిస జీవితం గడుపుతున్న భారతీయుల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిలించి.. స్వేచ్ఛవాయువులు పీల్చేలా చేశారు. ఆయనే జాతిపిత మహాత్మ గాంధీజీ. మహాత్ముడి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం…

సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమట దారిని చూపిన వ్యక్తి…తూరుపు తెల్లారని నడిరాత్రికి స్వేచ్చా భానుడి ప్రభాత కాంతి గాంధీ. మహాత్ముడికి తెలిసింది ఒక్కటే. ఎక్కడ వివక్ష ఉన్నా దానికి వ్యతిరేకంగా పోరాడడం… సత్యం, అహింసల కోసం ప్రాణాలను కూడా లెక్కచేయకపోవడం…ఒక్కో చినుకు గాలివానగా మారినట్టు…ఆయన ఒక్కో అడుగు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కోటలను బీటలు వారేలా చేసింది.

గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. 1869 అక్టోబరు 2న గుజరాత్ లోని పోర్ బందర్ లో జన్మించారు. చిన్నతనం నుంచే గాంధీజీలో అధ్యాత్మిక భావాలు ఎక్కవ. 13 ఏళ్ల వయస్సులో కస్తుర్బాతో బాపూజీకి వివాహమయింది.

మెట్రిక్యులేషన్ పూర్తైన తర్వాత 1888లో బారిష్టర్ చదివేందుకని తన 17వ ఏట లండన్ వెళ్లారు. అక్కడి నుంచి వచ్చాక ముంబాయి కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు.. ఓ కేసు వాదించేందకు 1893లో దక్షిణాఫ్రికా వెళ్లిన గాంధీజీ 21 ఏళ్లు అక్కడే ఉండిపోయారు. అక్కడ నల్లజాతీయుల మీద జరుగుతున్న జాతివివక్షను స్వయంగా అనుభవించారు. అక్కడ తనకు ఎదురయిన చేదు అనుభావాలు చరిత్ర గతిని మార్చగలిగిన గొప్ప నేతగా గాంధీజీని తయారు చేశాయి.

భారతీయుల ఆత్మగౌరవం కోసం దక్షిణాఫ్రికాలో శాసనోల్లంఘణోద్యమం చేపట్టి సక్సెస్ అయ్యారు గాంధీజీ. 40 ఏళ్ల వయస్సులో దేశానికి తిరిగొచ్చిన బాపూజీ …సేవా కోసం అహ్మాదాబాద్ లోని సభర్మతి దగ్గర ఆశ్రమం స్థాపించారు. 1919లో బ్రిటీషు సైనిక అధికారి జనరల్ డైయర్ ప్రజలపై కాల్పులు జరపడం… జలియన్ వాలా బాగ్ మారణ కాండ..గాంధీజీ రాజకీయాల్లోకి వచ్చేందుకు కారణమయ్యాయి.

అహిసనే ఆయుధంగా చేసుకుని..బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలని సిద్దాంతంతో బ్రిటీష్ పాలకుల సహనానికి పరీక్ష పెట్టారు. ఉప్పు సత్యాగ్రహంతో మొదలైన ఆయన పోరాటం…సహాయ నిరాకరణ వల్లే దేశానికి స్వాతంత్ర్యం వస్తుందని చెప్పిన గాంధీజీ…బ్రిటీసు వాళ్లు దేశం నుంచి వెళ్లే వరకు శాంతియుతంగా ఉద్యమం కొనసాగించారు

సత్యాగ్రహ ఉద్యమం, కైరా సత్యాగ్రహం, రౌలత్ సత్యాగ్రహం, నిరాకరణోద్యమం, శాసనోల్లంఘనం, బార్డోలి సత్యాగ్రహం, సైమన్ కమిషన్ రాక బహిష్కర్కరణ, ఉప్పుసత్యాగ్రహం, దండి యాత్ర, క్విట్ ఇండియా గాంధీజీ చేపట్టిన ఉద్యమాల్లో ముఖ్యమైనవి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత  హిందూ-ముస్లింల మధ్య శాంతి కోసం కలకత్తాలో నిరాహారదీక్ష చేశారు గాంధీజీ. ఉత్తర పంజాబు, బెంగాల్ లలో జరుగుతున్న హింసాత్మక చర్యలు ఆపాలంటూ  ఆమరణనిరాహార దీక్ష చేపట్టారు.

1948 జనవరి 30న గాడ్సే జరిపిన కాల్పుల్లో మహాత్ముడు ప్రాణాలు కోల్పోయాడు. దేశ భవిష్యత్ పై ఆయనకు ఎన్నో ఆలోచనలు ఉండేవి. అభివృద్ధి అనేది గ్రామం నుంచి మొదలవ్వాలంటూ గ్రామస్వరాజ్ భావనను గాంధీనే తెచ్చారు. ఊరు బాగుంటేనే దేశం బాగుంటుందన్న ఆలోచన గాంధీది. ఎవరికి వారుగా  తమ పనులు తామే చేసుకోవాలనేవారు గాంధీ. మన చుట్టూ ఉన్న పరిసరాల్లో పరిశుభ్రతను పాటించాలనేవారు. ఇప్పుడదే విషయాన్ని ప్రధాని మోడీ చెబుతున్నారు. అహింసా మార్గంలో లక్షలాదిమందిని కదిలించి దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు గాంధీజీ.

ఆయన మరణించినా, ఎప్పటికీ ప్రజల గుండెల్లో జీవించే ఉంటారు. మహాత్ముడి జీవితం ఓ పవిత్ర గ్రంథం.. ఆయన వ్యక్తిత్వం భావితరాలకు ఆచరణ మార్గం. జయంతి సందర్భంగా దేశం యావత్తు మహాత్ముడికి వందనం చేస్తోంది. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం అందరి ఆశయం కావాలి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy