బాపూజీ సేవలు మరువలేనివి

Screen Shot 2015-09-28 at 12.52.09 PMకొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివన్నారు నేతలు. రవీంద్ర భారతిలో జరిగిన శతజయంతి వేడుకల్లో  పార్టీలకతీతంగా నేతలు పాల్గొన్నారు.  తెలంగాణ పోరాట యోధుడు బాపూజీ శత జయంతి వేడుకలు అధికారికంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్న మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.  ఆయన ఆశయాల సాధనం కోసం కృషి చేయాలన్నారు నాయకులు.  హోం మంత్రి నాయిని మాట్లాడుతూ.. బాపూజీ సేవలు మరువలేనివి. తెలంగాణ పోరాటంలో బాపూజీతో కలిసి పని చేశామని గుర్తు చేశారు. బీసీలకు న్యాయం జరగాలని ఆయన పోరాడారని తెలిపారు.

బాపూజీ పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తాం: దత్తాత్రేయ

తెలంగాణ కోసం నిర్విరామంగా ఉద్యమించిన కొండా లక్ష్మణ్ బాపూజీ గుర్తుగా త్వరలోనే పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాపూజీ శతజయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. జలదృశ్యాన్ని బాపూజీ మెమోరియల్ కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బాపూజీ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy