బాప్ రే : దేశంలోని డబ్బంతా వాళ్ల దగ్గరే

richest

120 కోట్ల మంది జనం. దేశంలో కోట్ల కోట్ల డబ్బు. ఇదంతా ఎవరి దగ్గర ఉంది.. ఎంత మంది దగ్గర ఉంది అనేది ఆసక్తి. ఇదే విషయంపై ఆక్స్ ఫామ్ అనే సంస్థ సర్వే చేసింది. భారతదేశంలోని సంపదలో ఎక్కువ భాగం కేవలం ఒక్క శాతం మంది దగ్గరే ఉందంట. రూపాయిలో 73 పైసలు.. కేవలం ఒక్క శాతం మంది దగ్గరే ఉంది. అంటే మిగిలిన 27శాతం డబ్బు.. 99శాతం మంది జనం పంచుకుంటున్నారు. అంటే దేశంలోని 99 శాతం మంది జనం.. కేవలం 27శాతం డబ్బుతో బతికేస్తున్నారు. వీళ్లందరూ ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే అరకొర సంపాదనతో బతుకు బండి లాంగించేస్తున్నారు.

భారతదేశంలో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయనడానికి ఈ లెక్కలే నిదర్శనం అని ఆక్స్ ఫామ్ సర్వే వెల్లడించింది. ఇది ఆందోళన కలిగించే అంశం అని తెలిపింది. మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. 67 కోట్ల మంది భారతీయుల సంపద గత రెండేళ్లలో పెరిగింది కేవలం ఒక్క శాతం మాత్రమే. అంటే అంటే వెయ్యికి.. 10 రూపాయలు పెరిగింది వీరి సంపాదన. ఇది భారతదేశంలోని పరిస్థితి అయితే.. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన మొత్తం సంపదలో 82శాతం ధనివంతులైన కేవలం ఒక్క శాతం మంది దగ్గరే ఉందట. అంటే 370 కోట్ల మంది ప్రజలకు వారి సంపాదనలో ఏ మాత్రం అభివృద్ధి లేదంట. ధనికులు మరింత ధనవంతులవుతుండగా.. పేదవాళ్లు మరింత పేదవాళ్లుగా మారుతున్నారని సర్వేలో తేలింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy