బాబాయ్ తో గొడవలు చెప్పాడు

jagapati on ntrఎన్టీఆర్ ను ఓ క్వశ్చన్ అడిగా.. మీ బాబాయ్ బాలకృష్ణతో గొడవలు ఉన్నాయా అని.. దీనికి సమాధానం ఇలా వచ్చింది. “బాబాయ్ నాకు తండ్రి లాంటి వారు.. మా మధ్య గొడవలు ఏముంటాయ్” అని చెప్పాడు. ఈ మాటలు అన్నది అల్లాటప్పావాళ్లు కాదు.. హీరో, లెజండ్ విలన్ జగపతిబాబు. నాన్నకు ప్రేమతో.. మూవీలో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటించిన ఆయన.. ఓ ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పుకొచ్చాడు. అంతేకాదండీ.. ఎన్టీఆర్ చాలా క్లారిటీతో ఉన్నాడు.. మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు అని అన్నాడు. జగపతి అన్నమాటలపై ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా మరోలా చర్చించుకుంటోంది. ఎన్టీఆర్ మనసులో ఏమీ లేకపోతే.. ఇష్యూలో తప్పంతా.. బాలకృష్ణ వైపు వేలెత్తిచూపించేలా ఉందనే టాక్ నడుస్తోంది. కాంట్రవర్సీ లేకుండా క్లారిటీ ఇద్దామనుకున్న జగపతిబాబు.. బాబాయ్ – అబ్బాయ్ మధ్య ఇరుక్కుపోయాడా అనే టాక్ నడుస్తోంది. ఏమైనా ఓ కుటుంబంలోని వివాదం.. అందునా నందమూరి వంశంలో అంటే హాట్ టాపిక్కే కదా.. దీనికితోడు రాజమౌళి నాన్నకు ప్రేమతో మూవీ ఫస్ట్ షోను విత్ ఫ్యామిలీతో చూడటం కూడా ఆసక్తి రేపుతోంది. మరి డిక్టేటర్ పై ఎలాంటి కామెంట్ చేయని ఈ బాహుబలి డైరెక్టర్ పై.. బాలయ్య అభిమానులు గుర్రుగా ఉన్నారంట.. చూడాలి ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఈ స్టోరీ…

 

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy