బాబు నీరు-చెట్టు

babu neeru chettuనీళ్ళులేక.. ఎప్పుడూ కరువుతో విలవిలలాడే అనంతపురం జిల్లాకు ఈవేళ నీళ్ళ ప్రోగ్రామ్ కు వేదికయింది. అనంతపురం జిల్లాకే కాకుండా రాయలసీమ జిల్లాలన్నింటికి నీళ్ళు వచ్చేలా ప్లాన్ చేస్తామని ఆంధ్రా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

కరువు భయపడాలి

మనని చూసి కరువు భయపడాలి తప్ప, కరువును చూసి మనం భయపడకూడదని ఆంధ్రా సీఎం చంద్రబాబు అన్నారు. ‘నీరు – చెట్టు’ పథకం, పొలాల్లో కుంటలు తవ్వడం దీనిలో భాగమేనన్నారు బాబు. అనంతపురం జిల్లాలో లక్ష సాగునీటి చెరువులు తవ్వించి పొలాలకు నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తామన్నారు. అనంతపురంలో జరిగిన ‘నీరు – ప్రగతి’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

సీమకు నీళ్లొద్దా జగన్: జేసీ దివాకర్ రెడ్డి

రాయలసీమకు నీళ్ళు వద్దంటే జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎంపీ జేసీ దివాకరరెడ్డి అన్నారు. చంద్రబాబుకు చెడ్డపేరు తేవాలన్న ఏకైక లక్ష్యంతో జగన్ పనిచేస్తున్నారని అన్నారు జేసీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ నరసింహన్ ను చంద్రబాబు సత్కరించారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy