బాబు జమానా.. అవినీతి ఖజానా: ఏపీసీసీ

APCONSDARANఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టాడన్నారు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి.  చంద్రబాబు అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.  ఏపీలో టీడీపీ పాలనకు వ్యతిరేకంగా ఇందిరాపార్కులో దీక్షకు దిగిన ఆ రాష్ట్ర పీసీసీ…. చంద్రబాబు ఏడాది పాలనలో 365 రోజులు అవినీతిలో మునిగిపోయారని ఆరోపించారు.  ఈ దీక్షలో ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, జేడీ శీలం, పళ్లంరాజు, కేవీపీ, శైలజానాథ్ సహా పలువురు సీనియర్ లీడర్స్ పాల్గొన్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy