బాబోయ్ ఎండలు…

India Heat_Kand (2)ఎండలు మండిపోతున్నాయి. జూన్ వచ్చినా వర్షాలు పడని వైనం. వేడికి మలమలామాడిపోతూ ప్రజలు తెగ ఇబ్బందులు పడిపోతున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి.  ఎన్నడూ లేని విధంగా విశాఖలో 43 డిగ్రీలు నమోదయ్యింది. ఇది గత అరవై ఏళ్లలో రికార్డు. రుతుపవనాలు ఎంటరైయి వర్షాలు పడాల్సిన సమయంలో ఇంకా ఎండలు తాటతీస్తున్నాయి. కనీసం ఉష్ణోగ్రతలు తగ్గాల్సిన సమయం… కానీ అది కూడా లేకుండా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.

ప్రకృతి పగబడితే ఏలా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తున్నాడు మనిషి. వడదెబ్బకు పిల్లలు, పెద్దలు పిట్టల్లా రాలిపోతున్నారు. వేసవి తాపానికి రెండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అధికారిక సమాచారం ప్రకారం 48 మంది ప్రాణాలు వదిలారు. అనధికారికంగా ఈ లెక్క వందకు చేరుకుంటుందని అంచనా. మెదక్, కరీంనగర్ జిల్లాల్లో  ఎండల తీవ్రత అధికంగా ఉంది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  కృష్ణా, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. అరేబియా సముద్రంలో ఏర్పడిన నానక్ తుఫాన్ కారణంగా కేరళలో ప్రవేశించిన రుతువపనాలు మందగమన దిశలో ఉన్నాయి. దీంతో ఇప్పటీకే రాయలసీమలో ప్రవేశించాల్సిన రుతుపవనాలు అడ్రస్ లేకుండా పోయాయి. ఇక ప్రజలు కష్టాలు అయితే అన్ని ఇన్ని కావు. ఒక వైపు ఎండలు, మరో వైపు కరెంట్ కోతలు…ఇదే సమయంలో పిల్లలకు బడులు. అయితే ఈ ఎండలను తట్టుకుని పిల్లలు బడికి రాలేరని కొన్ని పాఠశాలలు ఏకంగా సెలవులు ప్రకటించాయి.

రుతుపవనాలు వచ్చి ఎండలకు చెక్ పెడుతాయనుకున్న ఆశలు అడియాశలే అయ్యాయి. వాటి కోసం ఎదురు చూపులే కానీ…ఫలితం కనిపించడం లేదు. రుతుపవనాలు ఎప్పుడొస్తాయో… ఈ ఎండలు ఎప్పుడూ తగ్గుతాయో… అంటూ నిట్టూరుస్తున్నారు ప్రజలు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy