బామ్మ అంత్యక్రియలో 100 మంది వారసులు

AMMALతమిళనాడు ‘బామ్మ’గా పేరుపొందిన కృష్ణమ్మాళ్‌ చనిపోయారు. ఆమె వయసు 114 ఏళ్లు. వయసుతోపాటే ఆమె కుటుంబమూ అతి పెద్దదే. ధర్మపురి జిల్లా కారియమంగళం చిన్నమాట్లాంబట్టికి చెందిన రైతు మునుసామి భార్య కృష్ణమ్మాళ్‌ 1902లో జన్మించారు. ఆమె సేలం జిల్లా సవరియూరుకు చెందినవారు. మునుసామి, కృష్ణమ్మాళ్‌ దంపతుల కూతులరు సరస్వతి. ఆమెకు ఇద్దరు కుమారులు. తర్వాత తరం వారసులు పెరగటంతో కష్ణమ్మాళ్‌ కు మనవళ్లు, మనవరాళ్లు కలిపి మొత్తం 117 మంది ఉన్నారు. పదేళ్ల క్రితం ఆమె భర్త మునుసామి చనిపోయారు. కృష్ణమ్మాల్‌ చనిపోయే వరకూ ఆరోగ్యంగానే ఉన్నారు. ఏ చిన్న సమస్య కూడా రాలేదని వారసులు తెలిపారు. కృష్ణమ్మాళ్‌ అంత్యక్రియల్లో పాల్గొన్న ఊరిజనం కంటే మనవళ్లు, మనవరాళ్లే అధికంగా కనిపించారు. వందమంది వరకూ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కృష్ణమ్మాళ్‌కు తమిళనాడు, ఏపీ, కర్ణాటక, గుజరాత్ తో పాటు అమెరికా, ఆస్ట్రేలియాల్లోనూ మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. మూడేళ్ల క్రితం కృష్ణమ్మాళ్‌కు 110వ పుట్టినరోజు వేడుకలను ఇంటివద్దే వైభవంగా నిర్వహించారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy