బారాత్‌ గొడవ : మద్యం మత్తులో కత్తిపోట్లు..యువకుడు మృతి

MURDERమద్యం మత్తులో ఇద్దరి యువకుల మధ్య పెరిగిన వివాదం ప్రాణాలమీదకు తెచ్చింది. క్షణికావేశంలో యువకుడిని కత్తితో పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం (మే-12) రాత్రి జగిత్యాల జిల్లాలో జరిగింది. వివరాలివి.. పెళ్లి బారాత్‌ లో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని బాలాజీ థియేటర్‌ సమీపంలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో రెండు వర్గాల మధ్య మాట మాట పెరిగి వివాదానికి దారి తీసింది. దీంతో వారు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అభి అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మరో యువకుడు కిరణ్‌ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అంతేకాక ఈ దాడికి గల కారణాలను తెలుసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy