బార్ లో లిక్కర్ తోపాటు డాన్స్ పెట్టుకోవచ్చు.. సుప్రీం కోర్టు

డాన్స్ బార్ల రూల్స్ ను సుప్రీం కోర్టు సులభతరం చేసింది. మహారాష్ట్రలో ప్రభుత్వం కఠినమైన నిబంధనలతో తెచ్చిన డాన్స్ బార్ రెగ్యులేషన్ చట్టాన్ని మార్చాలని సూచించింది. ఆ చట్టంలోని స్ట్రిక్ట్ నిబంధనలను మార్చాలని తీర్పు ఇచ్చింది. సరైన అనుమతితో బార్లలో లిక్కర్ తోపాటు డాన్సులు కూడా పెట్టుకోవచ్చని సుప్రీం స్పష్టం చేసింది. చట్టానికి వ్యతిరేకంగా డాన్స్ బార్ల యజమానులు సుప్రీం కోర్టుకు వెళ్లడంతో పలు నిబంధనలను సరళతరం చేస్తూ తీర్పు ఇచ్చింది.

ఆ నిబంధనలు.. మార్పులివే..

  • స్కూళ్లు, ఆలయాలకు కనీసం కిలోమీటరు దూరంలోనే డాన్స్ బార్లు పెట్టుకోవాలన్న నిబంధన ఆ రాష్ట్ర చట్టంలో ఉండేది. దానిని పాటించడం ముంబైలో సాధ్యం కాదని, దీనిని మార్చాలని మహారాష్ట్ర అసెంబ్లీకి సుప్రీం కోర్టు సూచించింది.
  • డాన్సర్లకు టిప్పులు ఇవ్వకూడదన్న నిబంధనను మారుస్తూ టిప్పులు ఇవ్వడంలో తప్పులేదని, డబ్బులు అమ్మాయిలపై వెదజల్లడాన్ని మాత్రమే ఆపాలని డైరక్షన్ ఇచ్చింది సుప్రీం.
  • డాన్స్ ఫోర్, లిక్కర్ సర్వ్ చేసే రూముల వేర్వేరుగా ఉండాలన్నది నిబంధన. దాన్ని మార్పు చేసి అంతా కలిసి ఉండొచ్చని సుప్రీం చెప్పింది.

ఇదీ చట్టం

ఈ డాన్స్ బార్ రెగ్యులేషన్ చట్టాన్ని 2016లో మహారాష్ట్ర అమలులోకి తెచ్చింది. డాన్స్ జరుగుతున్న ప్రాంతంలో లిక్కర్ సర్వ్ చేయడాన్ని ఈ చట్టం నిషేధించింది.  డాన్స్ బార్లను రాత్రి 11.45 గంటల కల్లా మూసేయాలని నిబంధన పెట్టారు. చట్టంలోని నిబంధనలను పాటించకపోతే డాన్స్ బార్ ఓనర్లు, కస్టమర్లకు భారీ జరిమానాలు విధించాలని అందులో పేర్కొన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy