బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం కమిటీలు : నాయిని

Naini_Narshimha_Reddy1బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం కమిటీలు ఏర్పాటు చేశామన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి . శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బాల కార్మిక నిర్మూలనపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రెడ్‌క్రాస్, ఎన్జీవోలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు నాయిని. జిల్లా, మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. బాలకార్మికులను హోటళ్లు, పరిశ్రమలు, దాబాల్లో గుర్తించామన్నారు కార్మిక శాఖ మంత్రి. అన్ని జిల్లాల్లో నేషనల్ చైల్డ్ సొసైటీలు ఏర్పాటు చేశామన్నారు. బాలకార్మికుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు ఆయన. 8, 874 మంది బాల కార్మికులను నియమించుకున్న యజమానులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. యజమానుల వద్ద కార్మికుడికి రూ. 20 వేల చొప్పున వసూలు చేస్తున్నామని చెప్పారు. వసూలు చేసిన డబ్బును బాలకార్మికుల సంక్షేమం కోసం కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేస్తున్నామని తెలిపారు నాయిని. మూడున్నరేళ్లలో కలెక్టర్ల వద్ద రూ. 44 లక్షలు డిపాజిట్ చేశామన్నారు.  కనీస వేతనాల చట్టం కింద యజమానులపై చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు నాయిని.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy