‘బాలకృష్ణుడు’ వచ్చేశాడు..!

nararohit-movieవైవిద్యభరితమైన సినిమాలు తీయడంలో ముందుండే టాలీవుడ్ హీరో నారా రోహిత్ లేటెస్ట్ మూవీ ‘బాలకృష్ణుడు’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే ఈ నెల(రేపు) 25న నారా రోహిత్ బర్త్ డే స్పెషల్ గా  ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. పవన్‌మల్లెల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న బాలకృష్ణుడు పోస్టర్‌లో నారారోహిత్ డిఫరెంట్ లుక్‌తో అదరగొడుతున్నాడు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. ఓవైపు నారా రోహిత్ నటించిన ‘శమంతకమణి’ థియేటర్లలో సందడి చేస్తుండగానే..మరోవైపు ‘బాలకృష్ణుడు’లో బిజీగా ఉన్నాడన్నమాట. అయితే ఈ మూవీలో నారా రోహిత్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy