బాలయ్యతో నాకు గొడవల్లేవ్

balayya-nagబాలయ్యతో తనకు ఎలాంటి గొడవల్లేవన్నారు అక్కినేని నాగార్జున. దీనిపై వస్తున్న వార్తలను ఖండించారు. ‘మా ఇద్దరికీ పడదన్న మాటల్లో వాస్తవం లేదు. అవన్నీ రూమర్సే’ అని కొట్టిపడేశారు. అవన్నీ వదంతులేనని చెబుతూ బాలయ్యను శాలువాతో సత్కరించారు. కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన నాగ్… బాలయ్య, తాను గొడవపడలేదని స్పష్టం చేశారు. శనివారం విశాఖ పోర్టు స్టేడియంలో జరిగిన టీఎస్ఆర్‌ జాతీయ చలనచిత్ర పురస్కారాలు-2015, 16 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నో ఏళ్లుగా కళాకారులను ప్రోత్సహిస్తున్న సుబ్బిరామిరెడ్డి గొప్ప వ్యక్తి అని కొనియాడారు నాగార్జున. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు, హేమామాలిని, మోహన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో గౌతమీ బాలశ్రీగా హేమమాలిని అద్భుతంగా నటించారని బాలకృష్ణ ప్రశంసించారు. తెలుగు, భారతజాతి తరపున ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో నటించడాన్ని జీవితంలో మర్చిపోలేనని హేమామాలిని చెప్పారు. కళాకారుల కోసం, విశాఖవాసుల కోసం అనేక కార్యక్రమాలు చేసే టీఎ్‌సఆర్‌ ఆదర్శనీయులని చిరంజీవి అన్నారు. గతంలో శ్రీకృష్ణదేవరాయలు, అక్బర్‌ వంటి రాజులు కళాకారులను, కవులను ప్రోత్సహిస్తే, నేడు సుబ్బిరామిరెడ్డి ఆ బాధ్యత తీసుకున్నారని మోహన్‌బాబు ప్రశంసించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy