బాలయ్య, పవన్, ఎన్టీఆర్ ఒకేవేదికపైకి

Ballayya,pawan,ntrబాలకృష్ణ, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ముగ్గురూ ఒకే స్టేజ్ పైకి వస్తే.. ఇప్పటి వరకు ఊహకు అందని.. ఊహించలేని ఈ జోడీ ఒకే వేదికపైకి రాబోతున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్. ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ఈ స్టార్స్ కలిసి రానున్నట్లు ఒకటే టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఆడియో ఫంక్షన్ కు రావాలంటూ బాలయ్యను.. ఎన్టీఆర్ స్వయంగా ఆహ్వానించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ‘స్వయంగా ఇంటికి వచ్చి మాట్లాడతా బాబాయ్..’ అంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇదే ఆడియో ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ ను తీసుకురావాలని డైరెక్టర్, నిర్మాత బాగా ట్రై చేస్తున్నారంట. సుకుమార్ కు వపన్ కళ్యాణ్ తో మంచి రిలేషన్ ఉంది.. అదే విధంగా నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్.. అత్తారింటికి దారేది మూవీతో పవన్ కళ్యాణ్ కు దగ్గరయ్యాడు. డైరెక్టర్, నిర్మాతకు పవన్ అంటే అభిమానం కూడా.. సో రిలేషన్ తోనే పవన్ ను కూడా వ్యక్తిగతంగా నాన్నకు ప్రేమతో ఆడియాకు ఇన్వైట్ చేస్తున్నారంట. ఇక ఏపీలో టీడీపీకి పవన్ ఇస్తున్న సపోర్ట్ కూడా తెలిసిందే. బాలయ్య కూడా ఈ విషయంలో ఎప్పుడూ కామెంట్ కూడా చేయలేదు. వ్యక్తిగతంగా పవన్ – బాలయ్య మధ్య మంచి సంబంధాలే ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్. ఈ క్రమంలో ఎన్టీఆర్ రిక్వెస్ట్ తో బాలయ్య, డైరెక్టర్, ప్రొడ్యూసర్ రిక్వెస్ట్ తో పవన్ ఆడియో ఫంక్షన్ లో మెరవనున్నట్లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. 2016 ఓపెనింగ్ లో ఇండస్ట్రీ బిగ్ బ్రేకింగ్ ఖాయం అంటున్నారు సినీ అభిమానులు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy