బాలానగర్ మెట్రో స్టేషన్ పేరు మార్పు

bvcనగరంలోని బాలానగర్‌ మెట్రో స్టేషన్‌ పేరు మారింది. దీన్ని బి.ఆర్‌.అంబేడ్కర్‌ బాలానగర్‌ మెట్రో స్టేషన్‌ గా ఇకపై దీనిని పిలవనున్నారు. శనివారం(ఏప్రిల్-14) అంబేద్కర్‌ జయంతి సందర్భంగా మారిన పేరుతో ఏర్పాటు చేసిన సైన్‌ బోర్డును ఆవిష్కరించారు మెట్రో ఎండీ ఎన్‌.వి.ఎస్‌.రెడ్డి. అంబేద్కర్ జయంతి రోజున స్టేషన్‌ కు ఆయన పేరు పెట్టడంపై అందరూ ఆనందం వ్యక్తం చేశారు.సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఈ సందర్భంగా ఎన్. వి. ఎస్. రెడ్డి మాట్లాడుతూ… మహామేధావి అంబేద్కర్ పేరు మెట్రో స్టేషన్ కు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఎల్ అండ్ టీని ఒప్పించి పేరు మార్చామని తెలిపారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy