బాలికపై అత్యాచారానికి నిరసన : కూతురితో న్యూస్ చదివిన యాంకర్

bagఎనిమిదేళ్ల బాలికను అత్యాచారం చేసి.. హత్య చేసిన ఘటన పాకిస్థాన్‌లో కలకలం రేపుతోంది. దీనిపై పెద్దఎత్తున నిరసనలు మొదలయ్యాయి. ఇందుకు టీవీ ఛానల్స్ కూడా మద్దతు ఇచ్చాయి. ఈ క్రమంలోనే పాక్ టీవీ చానెల్‌ ‘సమా’ యాంకర్‌ కిరణ్ నాజ్‌ లైవ్ లోనే తన నిరసన వ్యక్తం చేసింది. రెండేళ్ల తన కూతురిని ఒళ్లో కూర్చోబెట్టుకుని న్యూస్‌ చదివింది.

‘ఈ రోజు నేను కిరణ్ నాజ్‌ను కాదు. ఒక అమ్మను. అందుకే నా కూతురితో ఇక్కడ కూర్చున్నాను’ అని ఆమె న్యూస్‌ ప్రారంభించారు. పాకిస్థాన్ లో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని భావోద్వేగంతో మాట్లాడింది. చిన్న శవపేటికలే అత్యంత బరువైనవనే మాట ఎంతో సత్యం. ఆ చిన్నారి శవపేటిక బరువును ఇప్పుడు యావత్‌ పాకిస్థాన్‌ మోస్తోంది అని కిరణ్ నాజ్ కన్నీళ్లతో తన ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ దేశం పంజాబ్‌ ప్రావిన్స్‌లోని కసూర్‌లో ఎనిమిదేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది.

Justice For Zainab

Samaa news anchor Kiran Naz brings her own daughter into the studio Hear her powerful words#JusticeForZainab Details: http://bit.ly/2EtKXXV

Samaa TV 发布于 2018年1月11日周四

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy