మామిడిపళ్ళ చోరీ గొడవ ఒకమ్మాయి ప్రాణం తీసింది

Sequence 1ఉత్తరప్రదేశ్ లోని పత్తేపూర్ లో దారుణం జరిగింది. మామిడి పండ్ల కోసం  ఓ అమ్మాయిని సజీవ దహనం చేశారు. ఈనెల 10న మామిడి పళ్ళు దొంగతనంగా  కోయడానికి నలుగురు వ్యక్తులు శివ్ భూషణ్ తోటలోకి చొరబడ్డారు. దీన్ని గమనించిన శివభూషణ్  వారిని అడ్డుకున్నారు. దీంతో కోపం పెంచుకున్న ఆ నలుగురు 13న మళ్లీ శివ్ భూషణ్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో శివ్ భూషణ్ కూతురు ఒక్కతే ఉండటంతో తీవ్రంగా కొట్టారు. విషయం బయటకు చెబుతుందేమోననే భయంతో.. కిరోసిన్ పోసి తగలబెట్టారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy