బాలుడి జీవితంలో వెలుగులు నింపిన కేటీఆర్

Sami_Tea_Sellerసోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుంటారు  మంత్రి కేటీఆర్. కేటీఆర్ చేసిన సాయం 15 ఏళ్ల బాలుడి జీవితాన్నే మార్చేసింది. అతని జీవితంలో వెలుగులు నింపింది. స్కూల్ కి పంపటానికి ఆర్ధిక స్ధోమత లేక అజీజ్ అనే వ్యక్తి తన కుమారుడు “సామి” తో టీ, సిగరెట్ స్టాల్ ను హైదరాబాద్  బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని సిటీ సెంటర్ మాల్ దగ్గర నిర్వహిస్తున్నాడు. 15 ఏళ్ల సామి చలిలో వణుకుతూ టీ అమ్ముతున్న పరిస్ధితిని డిసెంబర్(2017)నెలలో రియాజుద్దీన్ అనే వ్యక్తి కేటీఆర్ కు ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.  ట్వీట్ పై స్పందించిన కేటీఆర్ …తప్పకుండా ఆ బాలుడిని స్కూల్ కి పంపించేలా చర్యలు తీసుకుంటామని ట్వీట్ చేసిన వ్యక్తికి తెలిపారు. వెంటనే ఆ బాలుడు స్కూల్ కి వెళ్లి అందరి పిల్లలులాగే చదువుకొనే ఏర్పాటు చేయాలని తన కార్యాలయ సిబ్బందికి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కార్యాలయ సిబ్బంది అదేరోజు సామి తండ్రి అజీజ్ కి ఫోన్ చేసి మాట్లాడి  వివరాలను తెలుసుకున్నారు.  ఆసిఫ్ నగర్ లోని స్టేట్ మైనారిటీ స్కూల్ లో అడ్మీషన్ ఇప్పించారు. 2018 జనవరి1 న సామి స్కూల్ లో చేరాడు. తమ పరిస్ధితిని అర్ధం చేసుకొని సహాయం చేసిన మంత్రి కేటీఆర్ కు సామి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy