బాలుడి ప్రాణాలు తీసిన సెల్ ఫోన్ డ్రైవింగ్

duఫోన్ మాట్లాడుతూ కారుతో ఢీకొట్టి ఓ చిన్నారి మ‌ర‌ణానికి కారణ‌మైంది ఢిల్లీ యూనివ‌ర్శిటీలో ప‌నిచేస్తున్న ఓ ప్రొఫెస‌ర్‌. ఢిల్లీ వ‌ర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్న‌అనుప‌మ న‌జ‌బ్‌గ‌ఢ్ రోడ్‌లో కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతోంది. రోడ్డుకు ప‌క్క‌గా నితేష్ అనే కుర్రాడు సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్నాడు. ఫోన్ మీదే దృష్టిపెట్టిన అనుప‌మ ఆ సైకిల్‌ను ఢీకొట్టి బాలుడు మీద‌నుంచి కారుపోనిచ్చింది. జ‌రిగిన పొర‌పాటును తెలుసుకుని వెంట‌నే తానే తులారాం మెమోరియ‌ల్ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లింది. అయితే అప్ప‌టికే బాలుడు చ‌నిపోయాడు.విష‌యాన్ని క‌న్న‌వారికి చెప్పి తానే పోలీస్ స్టేష‌న్‌లో లొంగిపోయింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy