బాల్ తగిలి పాక్ క్రికెటర్ మృతి

zubairఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ గుర్తున్నాడుగా… బాల్ తగిలి చనిపోయాడు. క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెర పరిచిన ఈ ఘటన.. అప్పట్లో పెద్ద సంచలనమే అయ్యింది. ఇప్పుడు అలాంటి ఘటనే పాకిస్థాన్ లో చోటు చేసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన యువ బ్యాట్‌మెన్‌ జుబైర్‌ అహ్మద్‌ ఓ బౌన్సర్‌ బంతికి ప్రాణం విడిచాడు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మార్డన్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో జుబైర్‌.. క్వెట్టా బియర్స్‌ జట్టు తరపున ఆడుతున్నాడు. మ్యాచ్‌ సమయంలో ప్రత్యర్థి బౌలర్‌ విసిరిన బౌన్సర్‌ బంతి జుబైర్‌ తలను బలంగా తగలడంతో అతడు అక్కడిక్కడే చనిపోయాడు. ఈ విషాయన్ని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. జుబైర్‌ మరణం ఆటగాళ్లకు భద్రత ముఖ్యమనే విషయాన్ని మరోసారి గుర్తుచేస్తోందని వ్యాఖ్యానించింది. ఎల్లవేళలా హెల్మెట్‌ ధరించాలని సూచిస్తూ, మృతుడి కుటుంబానికి సంతాపాన్ని తెలిపింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy