బాహుబలి రీమేక్ పోస్టర్ విడుదల

12li“బాహుబలి” ప్రపంచ వ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకూ భారతదేశ సినీ రికార్డులన్నీ బద్దలు కొట్టింది. ఇప్పుడు ఈ సినిమాని భోజ్‌పూరి నటుడు దినేశ్‌ లాల్‌ యాదవ్‌ నిరహువా రీమేక్ చేస్తున్నాడు. దీనికి  ‘వీర్‌ యోధ మహాబలి’ పేరు పెట్టారు. అమ్రపాలి డుబే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల మూవీ టీమ్ విడుదల చేసింది. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ్‌, బెంగాళీ, భోజ్‌పూరి భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఇక్బాల్‌ బక్ష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని ఆంగ్ల పత్రికలు కూడా ఇది భాహుబలి రీమేక్ ని కథనాలు ప్రచురించాయి. అయితే సినిమా యూనిట్ మాత్రం దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy