బాహుబలి సినిమానా…బిజినెస్సా?

downloadప్రపంచమంతా ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్న సినిమా జక్కన్న బాహుబలి. ఈ పేరు తెలియని సినిమా అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు.కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్న ప్రజలకు వదిలేసి.. చిత్ర బృందం మాత్రం డబ్బులు పోగేసుకునే పనిలో పడ్డారు. ఎలాగా అని ఆలోచిస్తున్నారా…? ఏప్రిల్‌ 7 నంచి 17వరకూ బాహుబలి 1 పార్ట్ ను హిందీలో మళ్లీ ధర్మా ప్రొడక్షన్స్‌ విడుదల చేస్తోంది. ఈ సినిమా టికెట్టు కొన్న వారికి ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది. బాహుబలి-1 సినిమా టికెట్ కొన్నవారికి బాహుబలి-2 టికెట్‌ ఇస్తామని తెలిపారు. టికెట్  ఇస్తామనే అంటున్నారు కానీ ఎప్పుడో.. రిలీజ్ అయిన ఎన్ని రోజులకో అనేది మాత్రం స్పష్టంగా చెప్పటం లేదు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ ఆఫర్‌ వర్తించదని మరో బాంబు పేల్చారు.అంటే హిందీ వెర్షన్‌ లో కలెక్షన్లు భారీగా రావాలనే ఇన్ని కష్టాలు పడుతున్నారా అనే అనుమానం సినీ విమర్శకులు సైతం ప్రశ్నిస్తున్నారు. ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు జక్కన్న బాహుబలి రెండో భాగం రానుంది.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy