బిగిస్తున్న ఉచ్చు : దినకరన్ పై లుక్ అవుట్ నోటీస్

ttv-dinakaran_తమిళనాడులో శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ దేశం విడిచి వెళ్లకుండా.. లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్. దేశంలోని ప్రధాన ఎయిర్ పోర్టులకు ఈ నోటీసులు జారీ చేసింది. విదేశాలకు వెళ్లి పోయే అవకాశం ఉండటంతో.. ఈ చర్యలు తీసుకుంది ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్.

శశికళ వర్గానికి చెందిన అన్నాడీఎంకే పార్టీ గుర్తు తమకే రావాలన్న ఉద్దేశంతో టీటీవీ దినకరన్.. సుకేశ్ చంద్రశేఖర్ తో ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వజూపాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఎన్నికల కమిషన్.. క్రైమ్ బ్రాంచ్ కు తెలిపింది. పోలీసులు విచారణ నిమిత్తం దినకరన్ కు నోటీసులు పంపారు. మీడియా ముందు సుకేఖ్ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని దినకరన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. సుకేఖ్ చంద్రశేఖర్ తో దినకరన్ కు నాలుగేళ్లుగా సంబంధాలు ఉన్నాయని తేల్చింది క్రైమ్ బ్రాంచ్. పోలీసులు అరెస్టు చేసిన తర్వాత కూడా దినకరన్ సుకేఖ్ తో ఫోన్ లో మాట్లాడినట్లు తెలిపింది.

కర్ణాటకకు చెందిన సుకేఖ్ చంద్రశేఖర్‌ అనే బ్రోకర్‌ తో రూ.50 కోట్లు ఈసీకి లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో సుకేఖ్ ను ఢిల్లీ పోలీసులకు ఏప్రిల్ 17న పట్టుకున్నారు. దినకరన్‌ బండారం బట్టబయలైంది. రూ.1.30 కోట్లు డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు దినకరన్ నుంచే అందిందని సుకేఖ్ పోలీసుల విచారణలో తెలిపాడు. ఈ క్రమంలోనే దినకరనన్ ను పోలీసులు అరెస్ట్‌ చేస్తారనే ప్రచారం జరుగుతుండడంతో ముందస్తు బెయిల్ ప్రయత్నాలు చేస్తున్నాడు దినకరన్. బెయిల్ రాకపోతే.. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తాడేమోనన్న అనుమానంతో  ఢిల్లీ పోలీసులు దేశంలోని అన్ని ప్రధాన ఎయిర్ పోర్టులకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy