బిగ్ బ్రేకింగ్ : త్వరలో వెయ్యి నోటు!

new-rs-1000-note

ఉరుము, మెరుపు లేకుండా ఒక్కసారిగా దేశంలో మళ్లీ నోట్ల చర్చ మొదలైంది. కొత్త వెయ్యి నోటు రాబోతుంది.. ఇప్పటికే నోట్లు ప్రింట్ అయ్యాయి అంటూ ప్రచారం హోరెత్తుతోంది. జాతీయ మీడియాలో వీటిపై కథనాలు వస్తుండటంతో.. త్వరలోనే కొత్త వెయ్యి నోట్లు రాకకు సంకేతాలు అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇప్పటికే ప్రింటింగ్ కూడా పూర్తయ్యిందని.. జనవరిలోనే మార్కెట్ లోకి విడుదల చేయటానికి RBI ప్రయత్నించినా.. 500 నోట్లు పంపిణీలో జాప్యం కారణంగా వాయిదా వేసినట్లు చెప్పుకొచ్చారు. సెక్యూరిటీ పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు RBI వర్గాలు వెల్లడించినట్లు కథనం. రద్దు చేసిన పాత నోట్ల లోటును పూరించటం కోసం.. వెయ్యి నోట్లను తీసుకురానున్నట్లు సమాచారం. చిల్లర సమస్య తలెత్తటంతో… హడావిడిగా పెద్ద ఎత్తున రూ.500 నోట్లు తీసుకురావటం వల్ల వెయ్యి నోటు విడుదల ఆలస్యం అయ్యిందని RBI వర్గాలు చెప్పినట్లు INDIAN EXPRESS, NEWSWORLD పత్రికలు ప్రచురించాయి. రిజర్వ్ బ్యాంక్, కేంద్రం చేస్తున్న కసరత్తు తుది దశకు వచ్చిందని.. మార్చిలోనే మార్కెట్ లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని ఆర్బీఐ అధికారి చెప్పినట్లుగా ఈ కథనాల్లో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితమే ప్రముఖ బాబా రాందేవ్ మాట్లాడుతూ.. త్వరలోనే రూ.2వేల నోటును ఉపసంహరిస్తారని చెప్పటం చూస్తుంటే.. వెయ్యి నోటు రాక ఎంతో దూరంలో లేదని అనిపిస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy