బిగ్ మూవీ : రూ.500 కోట్లతో రామాయణం

ramayanaయుగాలు మారినా.. తరాలు మారినా.. నేటి సినిమా కథలకు మూలం రామాయణం, మహాభారతమే. ఏ కథ పుట్టినా ఆ రెండు పురాణాల్లోని అంశాలే పునాది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ రామాయణ, భారతాలకు ఉన్న విశిష్టత అది. అంతేనా వింటే రామాయణం.. తింటే గారెలు అనే సామెత కూడా ఉంది. పురాణాల్లో ప్రతి పాత్ర.. ప్రతి అంశం.. నేటి మనుగడకు ఎంతో స్ఫూర్తిదాయకం. అలాంటి స్ఫూర్తినిచ్చే పాత్రలకు రామాయణం ఒక నిదర్శనం. అంతటి గొప్ప పురాణ గాథను వెండితెరపై 3Dలో తెరకెక్కించే ప్రాజెక్ట్ లో బిజీ అయ్యారు అల్లు అరవింద్. రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో మూడు భాగాలుగా.. తెలుగు, తమిళం, హిందీ మూడు భాషల్లో నమిత్ మల్హోత్ర , మధు మాతేన సహకారంతో నిర్మించనున్నారు అల్లు అరవింద్. ఈ సినిమా దర్శకుడిని.. నటీ నటులను ఎంపిక కూడా ప్రారంభం అయ్యిందంట. అతిత్వరలోనే ప్రకటించనున్నారంట. ఇప్పటికే మహాభారాతాన్ని వెయ్యి కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి విజయం సాధించడం.. బిజినెస్ కు కూడా ఢోకాలేదని క్లారిటీ రావటంతో.. హిస్టారికల్, మైథలాజికల్ మూవీస్ పై ప్రొడ్యూసర్స్ ఆసక్తి చూపుతున్నారని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. రామాయణం కథ అంటే ప్రతి హిందువుకి టచ్ అవుతుంది.. ప్రతి భారతీయుడిని ఆలోచింపజేస్తుంది. సో ప్రత్యేకంగా కథను ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. తెరపై గ్రాఫిక్స్, బిజినెస్ స్ట్రాటజీ ప్లాన్ ఉంటే చాలు.. రూ.500 కోట్లకు ఈజీగా వెయ్యి కోట్లు వెనకేసుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఆల్ ద బెస్ట్..

One Response to బిగ్ మూవీ : రూ.500 కోట్లతో రామాయణం

  1. Anonymous says:

    In TV serials they are killing the story of Ramayanam. Hope this proposed picture protect the originality

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy