బిగ్ రిలీఫ్ : CBSE రీ ఎగ్జామ్ లేదు

cbse-result-declaredసెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(CBSE) పేపర్ల లీకేజీ వ్యవహారంలో విద్యార్థులకు ఊరట లభించింది. పదో తరగతి మ్యాథ్స్‌ ఎగ్జామ్‌ను తిరిగి నిర్వహించబోవట్లేదని మంగళవారం (ఏప్రిల్-3) ప్రకటించింది. సమగ్ర అధ్యయనం తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు.

విద్యార్థుల ఇబ్బందులు, పేపర్‌ లీకేజీ వ్యవహారం ప్రాథమిక విచారణ నివేదిక ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని రీఎగ్జామ్‌ నిర్వహించకూడదని నిర్ణయించాం. ఇంతకు ముందు ప్రకటించినట్లు ఢిల్లీ, హరియాణాలో కూడా ఈ పరీక్ష నిర్వహించబోమని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి అనిల్‌ స్వరూప్‌ ట్వీట్‌ చేశారు.   పన్నెండో తరగతి ఎకనామిక్స్‌ పరీక్షను మాత్రం దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 25వ తేదీన  నిర్వహించనున్నట్లు ఇదివరకే బోర్డు ప్రకటించింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy