బిజీ షెడ్యూల్లో పీఎం మోడీ

635786853084623896.బిజీ షెడ్యూల్ తో ఫారెన్ లో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఐర్లాండ్ లో వన్ డే టూర్ కంప్లీట్ చేసుకుని న్యూయార్క్ లో లాండయ్యారు. దేశంలో పెట్టుబడులకు ముందుకు రావాలని ఐర్లాండ్ వ్యాపారవేత్తలను ఆహ్వానించారు పీఎం. అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వానికి సహకరించాలని కోరారు. ఇక ఇవాల్టి నుంచి నాలుగు రోజుల పాటు యూఎస్ లో పర్యటిస్తారు మోడీ. ఫేస్ బుక్, గూగుల్ ప్రధాన కార్యాలయాలను విజిట్ చేస్తారు.

పెట్టుబడులే లక్ష్యంగా ఐర్లాండ్ లో పర్యటించిన ప్రధాని పలు కీలక ఒప్పందాలపైసంతకాలు చేశారు. అలాగే 64 ఏళ్ల తర్వాత ఐర్లాండ్ లో పర్యటించిన భారత ప్రధానిగా రికార్డు క్రియేట్ చేశారు. రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలపైనే ప్రధానంగా చర్చించారు ఇద్దరు ప్రధానులు. ఐర్లాండ్ అభివృద్ధిలో 26 వేల మంది భారతీయుల కృషి ఉందన్నారు. భారత్-ఐర్లాండ్ మధ్య ఎన్నో సారుప్యతలున్నాయన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి మద్ధతివ్వాలని ఐర్లాండ్ ప్రధానిని కోరారు.

అంతకముందు ప్రధాని మోడీకి ఐర్లాండ్ ప్రధాని ఎండా కెన్నీ వినూత్నమైన కానుకలిచ్చారు. ఐరిష్ నేషనల్ గేమ్ అయిన హార్లింగ్ బ్యాట్, బాల్ తో పాటు ఐరిష్ క్రికెట్ టీమ్ జెర్సీని మోడీకి గిఫ్ట్ ఇచ్చారు. భారత్  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ గంగా ప్రాజెక్టుకు సహకరిస్తామంది ఐర్లాండ్.  ఇక భారత ప్రాచీన గ్రంథాల నుంచి సేకరించిన రాతప్రతులను కెన్నీకి అందజేశారు మోడీ. అలాగే ఐర్లాండ్ లో ఉన్న ఇండియన్స్ తో భేటీ అయ్యారు. దేశంలో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు.

ఐర్లాండ్ టూర్ ముగించుకున్న పీఎం.. యూఎస్ చేరుకున్నారు. ఇవాళ న్యూయార్క్ లో జరగనున్న యునైటెడ్ నేషన్స్ సస్టెయినెబుల్ డెవలప్ మెంట్ సమ్మిట్ లో మోడీ ప్రసంగిస్తారు. శాంతి స్థాపనకు సంబంధించి అమెరికా ప్రెసిడెంట్ ఒబామా ఏర్పాటు చేసిన సమావేశంలోనూ పీఎం పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ సంస్కరణలపై జీ 4 దేశాలమీటింగ్ లో ప్రధాని మాట్లాడుతారు.

ప్రధాని అయ్యాక రెండో సారి అమెరికాలో పర్యటిస్తున్న మోడీ.. గూగుల్, ఫేస్ బుక్ హెడ్ క్వార్టర్లను విజిట్ చేయనున్నారు. యాపిల్ సీఈవో టిమ్ కుక్, మైక్రో సాఫ్ట్ CEO సత్య నాదెళ్లతోనూ భేటీ అవుతారు. సిలికాన్ వ్యాలీలో వ్యాపారవేత్తలతో పెట్టుబడులపై చర్చిస్తారు. ఈ నెల 27 వరకు యూఎస్ లోనే ఉంటారు ప్రధాని.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy