బిలాయ్ స్టీల్ ప్లాంట్ లో పేలుడు, 6గురు మృతి

bhilai_explosion_360x270ఛత్తీస్ గడ్ లో ఘోరం జరిగిపోయింది. బిలాయ్ స్టీల్ ప్లాంట్ లో పేలుడు సంభవించింది. ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా… మరో యాబై మందికి తీవ్ర గాయాలయ్యాయి. వాటర్ పంప్ హౌజ్ లో ఏర్పడిన సాంకేతిక లోపంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. వాటర్ పంప్ హౌజ్ బ్రేక్ డౌన్ కావడంతో మీథేన్ , కార్బన్ డై క్సైడ్ లీక్ అయింది. ఈ ఘటనలో ఇద్దరు డీజీఎం స్థాయి అధికారులు అక్కడికక్కడే చనిపోగా..మరో నలుగురు ఆస్పత్రలో చికిత్స పొందుతూ మృతిచెందారు . ఇంకా 11 మంది పరిస్థితి మిషమంగా ఉంది.విషయం తెలిసిన వెంటనే ఆ రాష్ట్ర సీఎం రమణ్ సింగ్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రులు, స్థానికులు కూడా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
మరోవైపు మానెజ్ మెంట్ ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలను ఆదుకుంటానని హామి ఇచ్చింది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy