బిల్లు పై సభలో జరుగుతున్న వాదోపవాదాలు

eetela

ఈరోజు తీవ్ర గందర గోళాల మధ్య శాసన సభలో తెలంగాణా బిల్లు పై సభ్యులు అభిప్రాయాలు చెప్పడం కొనసాగుతుంది. శైలజానాద్, ద్రోణంరాజు శ్రీనివాస్, గాదేవెంకట రెడ్డి, అశోక గజపతి రాజు మొదలైనవారు బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడారు. CM కిరణ్ కూడా ఒక దశలో మాట్లాడుతూ PV నరసింహారావును నంద్యాల నుండి గెలిపించుకుంది తామని, దేశ ప్రధాని గానే తెలంగాణా వ్యక్తి ఉన్నారని, పదవులు దక్కలేదని ఇప్పుడు తెలంగాణా వారు ఆరోపించడం సరికాదని అన్నారు. వాళ్ళ సమయంలో నిధులు తెలంగాణాకు దక్కేలా చేసుకోవడం ఎవరి చేతగానితనమో ఆలోచిన్చుకోవాలన్నారు. చంద్ర బాబు కూడా PV కి అన్యాయం జరిగిందని పోరాటం చేసింది తామేనని గుర్తు చేసారు.

ఈటెల రాజేందర్ తెలంగాణా పక్షాన మాట్లాడుతూ తెలంగాణాకు జరిగిన, జరుగుతున్న అన్యాయాలను వివరంగా చెప్పారు. ప్రతి పార్టీ గత, ప్రస్తుత వైఖరులను తేటతెల్లం చేసారు.

YCP వాక్ ఔట్ తర్వాత సభ లో చర్చ గందరగోళాల మధ్యనే సాగుతుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy