బిల్ క్లింటన్ ను కలిసిన బిల్ క్లింటన్!

bill

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు ఉగాండ పర్యటనలో  ఓ వింత అనుభవం ఎదురైంది. 14 ఏళ్ల క్రితం ఆయన పేరు పెట్టిన బాలుడు ఆయనను మళ్లీ కలిశాడు. 1998లో అమెరికా అధ్యక్షుడిగా క్లింటన్ ఆఫ్రికాలోని ఓ గ్రామంలో పర్యటించారు. ఓ మహిళ తనకు పుట్టిన బిడ్డకు పేరుపెట్టాలని కోరటంతో క్లింటన్ గా పేరు పెట్టారాయన. ఆ బాలుడే 14 ఏళ్ల తర్వాత మళ్లీ  ఆఫ్రికా పర్యటనలో క్లింటన్ ను కలుసుకుని తనకు పేరు పెట్టిన నాటి ఫొటోను చూపించాడు. ఆ క్షణంలో బాలుడితో పాటు క్లింటన్ కూడా ఉద్వేగానికి లోనయ్యారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy