బీకేర్ ఫుల్: చేపల్లో ప్రమాదకర బ్యాక్టీరియాలు

చేపలను ఇష్టంగా తినేవారు ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తినే చేపల్లో సూపర్‌ బగ్స్‌ ఉండొచ్చంటున్నారు సైంటిస్టులు. మార్కెట్లో  ఎక్కువగా అమ్ముడవుతున్న చేపల్లో భయంకరమైన బ్యాక్టీరియా ఉందని వారు తెలిపారు. శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, ఎన్టీఆర్‌ వెటర్నరీ సైన్స్‌ కాలేజ్‌ సైంటిస్టుల పరిశీలనలో ఈ నిజాలు బయటపడ్డాయి . ఈ చేపల్ని తింటే కలరా తదితర జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

‘విబ్రియో’ జాతికి చెందిన 15 రకాల బ్యాక్టీరియాలను ఎక్కువ మంది ఇష్టపడి తినే కొన్ని రకాల చేపల్లో సైంటిస్టులు గుర్తించారు. వీటిలో కలరా రావడానికి కారణమయ్యే ‘విబ్రియో కలరా’ క్రిములు కూడా ఉన్నాయి. యాంటీ బయోటిక్స్‌ కు లొంగని సూపర్‌ బగ్స్‌ కూడా వీటిలో ఉన్నాయట. మురికి నీళ్లలో పట్టిన ఇతర జాతుల చేపల్లో కూడా ఈ బ్యాక్టీరియా ఉండొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు.

వండితే చచ్చిపోతాయ్‌ .. కానీ?

ఎక్కువ సేపు చేప మాంసాన్ని ఉడికించడం వల్ల సూపర్‌ బగ్స్‌ నశిస్తాయని  సైంటిస్టులు చెపుతున్నారు. ఏదో ఒక మూల బతికి మనిషి పొట్టలో కి చేరితే, దానికున్న యాంటీ బయోటిక్స్‌ కు లొంగని గుణం ప్రాణాంతకంగా మారొచ్చని హెచ్చరిస్తున్నారు. రీసెర్చ్ లో భాగంగా రెండు కళాశాలలకు చెందిన రీసెర్చర్లు  కొన్ని చేపల మార్కెట్లకు వెళ్లారు. అక్కడ అమ్ముతున్న 100 చేపల నుంచి  శాంపిల్స్‌ సేకరించారు. వాటిలో విబ్రియో జాతి బ్యాక్టీరియా కోసం వెతగ్గా , 87 చేపల్లో దాని ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. విబ్రియో పారా- హామోలైటికస్‌ , విబ్రియో వల్నిఫికస్‌ , విబ్రియో అల్గి నోలిటికస్‌ (కళ్లు, చెవులపై ప్రభావం), విబ్రియో కలరా బ్యాక్టీరియాల ఆనవాళ్లు  శాంపిల్స్‌ లో ఎక్కువగా ఉన్నాయట. 3.45 శాతం శాంపిళ్లలో కలరా బ్యాక్టీరియా కనిపించిందని  సైంటిస్టులు తెలిపారు.

మరోవైపు కృష్ణా నదిలో పట్టిన చేపల్లోనూ సూపర్‌ బగ్స్‌ ఉంటున్నాయని సైంటిస్టులు హెచ్చరించారు. మంచి నీళ్లలో పట్టిన చేపల్ని మాత్రమే తినాలంటున్నారు. విబ్రియో బ్యాక్టీరియా ఉప్పు నీళ్లలోనూ బతకగలదని వారు చెప్పారు. ఉడకని చేప మాంసాన్ని తినకూడదని..  ఉదయం వండిన చేపను,సాయంత్రం కూడా ఉడికించే తినాలని వారు  సూచించారు. ఇటీవలే సైంటిస్టుల రీసెర్చ్‌‌‌‌ ‘‘ఇంటర్నేషనల్‌‌‌‌ జర్నల్‌‌‌‌ ఆఫ్‌ కరెంట్‌ మైక్రోబయాలజీ అండ్‌ అప్లయిడ్‌ సైన్సెస్‌ ’’ జర్నల్‌‌‌‌లో పబ్లిష్ అయ్యింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy