బీజింగ్ లో బాంబు పేలుడు : యూఎస్ ఎంబసీ ముందు ఉద్రిక్తత

చైనా రాజధాని బీజింగ్ లో బాంబు పేలింది. గురువారం (జూలై-26) బీజింగ్ సిటీలో అమెరికా ఎంబసీకి సమీపంలో తక్కువ సామర్థ్యంతో పేలుడు జరిగింది.  దీంతో ఆ ప్రాంతమంతా పొగ కమ్మేసింది. ఎంబసీ నుంచి భారీ స్థాయిలో పొగ వస్తోంది. కార్యాలయం చుట్టు పోలీసులు వాహనాలు నిలిచిపోయాయి. అమెరికా, చైనా మధ్య ఇటీవల వాణిజ్య యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.

పేలుడు  జరిగిన కొద్ది సేపటికే.. యూఎస్ ఎంబసీ ముందు ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy