బీజేపీకి నాగం జనార్దన్‌రెడ్డి రాం రాం

nagam-janardan-reddyబీజేపీకి నాగం జనార్దన్‌రెడ్డి రాజీనామా చేశారు. గురువారం (మార్చి-22) బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు ఫ్యాక్స్‌ ద్వారా రాజీనామా లెటర్ ను పంపారు. నాగం జనార్ధన్ రెడ్డి ఇంట్లో నియోజకవర్గంలోని 5 మండలాల కార్యక్తలతో సమావేశమయ్యారు.
అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన నాగం..కార్యకర్తల వత్తిడి మేరకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను బీజేపీ ప్రస్తావించడం లేదని, అనుచరులు, కార్యకర్తల అభీష్టం మేరకే బీజేపీకి రాజీనామా చేశానని నాగం చెప్పారు. ప్రాజెక్ట్ ల నిర్మాణంలో అవినీతి పై ఎన్నో  కేసులు వేసినప్పుడు BJP నా వెంట రాలేదని చెప్పిన నాగం.. ఏ పార్టీలో చేరేది త్వరలోనే వెల్లడిస్తానన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy