బీజేపీకి వ్యతిరేకంగా గుజరాత్ లో సత్యాగ్రహ ర్యాలీ

Congress-Flag----272జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళాన్నిపెంచుతున్నాయి. ఈ నెల 27న పాట్నాలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ బీజేపీకి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ సైతం సెప్టెంబర్‌ 1న గుజరాత్‌లో సత్యాగ్రహ ర్యాలీని చేపట్టేందుకు రెడీ అయ్యింది. గిరిజనులపై దాడులను నిరసిస్తూ చేపట్టనున్న ఈ ర్యాలీ కోసం ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఏడాది చివర్లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోఈ ర్యాలీ ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్‌ యత్నిస్తోంది. ఈ నిరసనకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నేతృత్వం వహించనున్నారని సమాచారం.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy