బీజేపీకే గవర్నర్ ఆహ్వానం: రేపే యడ్యూరప్ప ప్రమాణం

Yeddyurappaకర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకే గ్రీన్ సిగ్నలిచ్చారు గవర్నర్ వజుభాయ్ వాలా. ఎన్నికల ఫలితాల్లో సాధారణ మెజార్టీకి దగ్గరగా వచ్చి ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. దీంతో ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన యడ్యూరప్ప కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు( గురువారం,మే-17) ఉదయం 9:30 గంటలకు రాజ్‌భవన్‌ ప్రాంగణంలోనే యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా తదితర ముఖ్యులు హాజరవుతారని సమాచారం.

గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న యడ్యూరప్ప.. మే27లోగా అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్‌ సూచించారు. ఆ తర్వాతే మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని స్పష్టం చేశారు.

జేడీఎస్‌-కాంగ్రెస్‌లు జతకట్టి, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామంటూ ముందుకొచ్చాయి. ఇరు పక్షాలతో మాట్లాడిన గవర్నర్‌ చివరికి బీజేపీకే అవకాశాన్ని కల్పిస్తూ… యడ్యూరప్పను సీఎంగా ప్రమాణం చేయాలంటూ ఆహ్వానించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy