బీజేపీకే జనం అండ

వచ్చే ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో బీజేపీ వెనకాల నిలబడే అవకాశం ఉందని ఒక సర్వేలో తేలింది. ఈ సర్వే మన దేశంలోని సంస్థ చేసింది కాదు. అమెరికాలో ప్రముఖ సర్వే ఏజెన్సీ పీ ఈ డబ్ల్యు ఈ సర్వే చేసింది. బీజేపీకి 60 శాతం ఓటర్లు అనుకూలంగా ఓటేయబోతున్నారని, కాంగ్రెస్ కు కేవలం 20 శాతంమందే ఓటేయబోతున్నారని ఈ సర్వేలో తేలింది. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయనేది సర్వేలో చెప్పలేదు. ఓట్లశాతం మాత్రం బయటపెట్టారు. అలాగే, ప్రధానమంత్రిగా రాహుల్ కన్నా మోడీకే జనం అనుకూలంగా ఉన్నట్టు సర్వే చెప్తోంది. కిందటేడాది డిసెంబర్ 7 నుంచి ఈ ఏడాది జనవరి 12 వరకు ఈ సర్వే నిర్వహించారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy