బీజేపీతో దోస్తీ ఉత్త ముచ్చటే: అసదుద్దీన్

MIM president Asaduddin Owaisi addresses press at Darussalam in Hyderabad on April 1, 2014. (Photo: IANS)బీహార్ ఎన్నికల్లో బీజేపీతో ఎలాంటి రహస్య ఒప్పందం పెట్టుకోలేదన్నారు ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. ఎన్నికల్లో ఎంఐఎం బీజేపీతో రహస్యంగా పొత్తు కుదుర్చుకుందన్న వార్తలను  ఆయన తీవ్రంగా ఖండించారు. బీహార్ లో జనతాపరివార్ కూటమిపై విమర్శల వర్శం కురిపించారు. జేడీయూ, ఆర్జేడీ,కాంగ్రెస్ కూటమి ద్వారా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగదన్నారు. ఆ పార్టీల గత రికార్డులను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ సీమాంచల్ ప్రాంతానికే పరిమితమవుతుందని..ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు అసదుద్దీన్. బీహార్ ప్రజలు మతపరమైన రాజకీయ విధానాలను కాకుండా లౌకిక నాయకత్వాన్ని గెలిపించాలని కోరారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy