బీజేపీ కంగారు : GSTపై హీరో విజయ్ పంచ్ డైలాగ్స్

mersal7 శాతం GST ఉన్న సింగపూర్ లో వైద్యం ఉచితం.. అదే 28శాతం GST ఉన్న భారతదేశంలో వైద్యం చాలా ఖరీదైంది. సామాన్యులకు వైద్యం అందుతుందా.. ఇదో పంచ్ డైలాగ్.. తమిళులు స్వేచ్ఛగా స్వతంత్రులుగా ఉంటారు.. జల్లికట్టును సాధించుకున్నారని చెబుతాడు.. భూమ్మీద ఎక్కడైనా సరే తమిళులు చాలా మంది వారు అంటూ చెప్పుకొస్తాడు.

ఈ డైలాగ్స్ సినిమాలోనివే.. పలికింది కూడా టాప్ హీరో. తమిళనాడులో దీపావళికి విడుదల అయిన హీరో విజయ్ మూవీ మెర్సల్ మూవీలో పంచ్ డైలాగ్స్ ఇవి. ఇప్పడు దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులకు కంటగింపుగా మారాయి. సినిమా నుంచి వీటిని తీసేస్తారా లేక సర్దుకుపోతారా అనేది తమిళనాడులో చర్చనీయాంశం అయ్యింది. సినిమాలో హీరోను అరెస్ట్ చేసిన సందర్భంగా విజయ్ ఈ డైలాగ్స్ చెబుతాడు. దీనిపై తమిళనాడు బీజేపీ చీఫ్ సౌందరరాజన్ ఇప్పటికే స్పందించారు. జీఎస్టీ, డిజిటల్ ఇండియాపై ఉన్న డైలాగ్స్ ను సెన్సార్ చేయాలని కోరారు. ప్రధాని మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకాలపై ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

GST అమలు చేసిన తర్వాత.. ఓ సినిమాలో దానికి సబంధించి వ్యతిరేకంగా డైలాగ్స్ రావటం దేశంలో ఇదే ప్రధమం. దీంతో తమిళనాడు బీజేపీ నేతలు కంగారు పడుతున్నారు. ఇటీవలే నోట్ల రద్దుకి సపోర్ట్ చేసి తప్పు చేశానని కమలహాసన్ ప్రకటించారు. ఇలా ఒక్కొక్క హీరో వ్యతిరేకంగా గళం విప్పుతుండటంతో కమల దళంలో హైరానా మొదలైంది. తమిళనాడులో సినిమా – రాజకీయాలను వేర్వేరు చేసి చూడలేం. గతంలో ఎంజీఆర్ కూడా సినిమాల్లో తమిళ మనోభావాలను ఎక్కువగా చూపిస్తూ.. సీఎం పీఠం ఎక్కిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy