బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు: విజయ్ క్రిస్టియన్.. అందుకే మోడీ అంటే పడదు

vijay-moneyబీజేపీ నేతల పైత్యం రోజురోజుకు ఎక్కువవుతుందా అనిపిస్తోంది…? ప్రభుత్వ విధానాలపై మాట్లాడితే… ఏదో ఒకటి అంటగట్టి మరీ విమర్శిస్తున్నారు. తాజాగా మెర్సెల్ వివాదంలో కొత్త వాదాన్ని తీసుకొచ్చారు తమిళనాడు బీజేపీ నేత, బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా. ఆ సినిమా హీరో విజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అతను ఓ క్రిస్టియన్ అని… అందుకే మోడీ అంటే అయిష్టత అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు ట్వీట్ లో విజయ్ ఓటర్ కార్డు, అతని లెటర్ హెడ్ ను ఉదాహరణగా చూపించారు. రెండింటిలో విజయ్ పూర్తి పేరు సి. జోసఫ్ విజయ్ గా ఉంటుంది. నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుందని ట్వీట్ చేశారు ఆ కాషాయపు నేత. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. విజయ్ మతం గురించి మాట్లాడే పెద్దాయన… 2014 ఎన్నికల సమయంలో మోడీని కలిసి విజయ్ మద్దతు పలికిన విషయం ఎందుకు ప్రస్తావించరు అని ప్రశ్నించారు. అయినా మెర్సెల్ లో కూడా విజయ్ హిందువుగానే నటించారు కదా.. ఆ విషయం ఎందుకు చెప్పరు అంటూ ట్వీట్ చేశారు. ఓ అభిమాని అయితే.. అతను ముస్లిం అయినా.. క్రిస్టియన్ అయినా ఆయనపై ఉన్న అభిమానం చెరిగిపోదన్నాడు. విజయ్ మతంపై మాట్లాడిన హెచ్.రాజా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy