బీజేపీ లీడర్ల తలో మాట!

kdసర్కారుపై స్టాండ్ లో క్లారిటీ మిస్ !

స్వచ్ఛ హైదరాబాద్ లోనూ తలో దారి

కేసీఆర్ సర్కారు నిర్ణయాలపై బీజేపి నేతల స్టాండ్ లో క్లారిటీ మిస్ అవుతోంది. నిన్నా మొన్నటి వరకు ఉప్పునిప్పులా ఉన్న గులాబీ, కమలం పార్టీలు స్వచ్ఛ హైదరాబాద్ తో కాస్తంత దగ్గరయ్యాయి. అయితే ఇందులోనూ బీజేపీలో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛ్ హైదరాబాద్ కు అటెండవడంపై కొందరు ‘ఓకే’ అంటే ఇంకొందరు ‘నో’ చెబుతున్నారు. స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమం పై కమలనాథుల్లో అయోమయంలో కనబడుతోంది. ప్రోగ్రామ్ ను విమర్శిస్తే అది తమ పార్టీ హైకమండ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. పోనీ సపోర్ట్ చేద్దామా అంటే టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలకు ఓకే చెప్పాల్సి వస్తుందనే ఆలోచనలో పడిపోయారు లీడర్స్.

మరోవైపు స్వచ్చ హైదరాబాద్ లో తమను భాగసామ్యం చేయడంలేదని ముందు  విమర్శించింది బీజేపీ. ఆ తరువాత సర్కార్ ఆహ్వానంతో కొంతమంది నేతలు సీఎం వెంట ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు. నేతలైతే అటెండవుతున్నారు కానీ తామెక్కడా ప్రభుత్వ ఉచ్చులో పడిపోయమా అనే అనుమానాలు కమలం నేతలు వెంటాడుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల కోసమే ప్రభుత్వం స్వచ్ఛ హైదరాబాద్ చేస్తున్నారన్న కమలం పార్టీ నేతలు ఇప్పుడు టీఆర్ఎస్ తో కలిసి తిరగడం క్యాడర్ లో అయోమయం నెలకొంది.

ప్రభుత్వ కార్యక్రమాలకు రాష్ట్ర స్థాయి నేతలు ఒకలా జాతీయ స్థాయి నేతలు మరోలా రియాక్టవడం గందరగోళానికి కారణమైంది. కేంద్రమంత్రలు వెంకయ్య నాయుడు, బండారుదత్తాత్రేయ TRS సర్కార్ పై ప్రశంసలు కురిపిస్తుంటే రాష్ట్ర ప్రార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ప్లోర్ లీడర్ లక్ష్మణ్ లు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఇక చింతల రాంచంద్రారెడ్డి, Nvss ప్రభాకర్ లు పరిస్థితులను బట్టి నడుచుకుంటున్నారు.

ఇలా ఒక్క పార్టీ నేతలు రెండు మాటలు మాట్లాడుతుండడం, సీనియర్ల డ్యూయల్ స్టాండ్ పై గుస్సా అవుతోంది కింది స్థాయి క్యాడర్. మరోవైపు OU  క్యాంపస్ భూముల విషయంలో సీఎం కామెంట్స్ పై కమలం నేతల రియాక్షన్ కూడా డిఫరెంట్ గా ఉంది. క్యాంపస్ ల్యాండ్ లో పేదలకు ఇళ్లు కట్టిస్తామనడాన్ని దత్తాత్రేయ సమర్థిస్తుంటే కిషన్ రెడ్డి మాత్రం వ్యతిరేకిస్తున్నారు.  ఈ వ్యవహారాల్లో సీనియర్ల మధ్య కోఆర్డినేషన్ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.

మరోవైపు అధికార పార్టీ నేతలు, మంత్రులు రాష్ట్ర బీజేపి నేతలను సంప్రదించకుండా నేరుగా హస్తిన పెద్దలతోనే మాట్లాడడం రెండు పార్టీల మధ్య దూరాన్ని పెంచుతోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy