బీటెక్ చదివిన కుర్రోడే : వీడియో గేమ్ కోసం సూసైడ్

video-1రంగారెడ్డి జిల్లా కుంట్లూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వీడియో గేమ్ సెటప్ కొనివ్వలేదని.. బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు బీటెక్ విద్యార్థి. వివరాల్లోకి వెళితే.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూర్ గ్రామానికి చెందిన అభినయ్.. వీడియో గేమ్ అడిగితే కొనివ్వలేదని మనస్థాపంతో బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయలవడంతో కామినేని హాస్పిటల్ కి తరలించి తరలించగా… చికిత్సపొందుతూ మరణించాడు అభినయ్. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు   చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy