బీసీసీఐ కొత్త బాస్ ఎవరో…

CRICKET CENTRE BUILDING, MUMBAI ---PIC : KALYAN CHAKRAVORTYరెండున్నరేళ్ల పదవీ కాలం. దాల్మియా ఉండుంటే… ఆ కుర్చీపై కన్నెత్తి చూసే ఛాన్స్ ఎవరికీ లేదు. కానీ ఆయన హఠాత్మరణంతో బీసీసీఐ… మరోసారి పాలిటిక్స్ కు వేదికగా మారింది. బాస్ కుర్చీకోసం పోటీ ఎక్కువైంది. నిజానికి దాల్మియా మరణంతో ఈస్ట్ జోన్ కు చెందిన వ్యక్తికే బీసీసీఐ చీఫ్ పదవి దక్కాల్సి ఉంది. కానీ ఓటింగ్ జరిగితే మాత్రం ఈస్ట్ జోన్ సంఘాల మద్ధతుతో ఎవరైనా ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ట్రై చేస్తే పోలా అంటూ మాజీ బాస్ లు శ్రీనివాసన్, శరద్ పవర్ తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్లతో పాటు రాజీవ్ శుక్లా…. అనురాగ్ ఠాకూర్ మరోవర్గంగా ట్రై చేస్తున్నారు. కొన్నేళ్లపాటు బీసీసీఐలో చక్రం తిప్పిన శ్రీనివాసన్ మరోసారి తన ఫేట్ ని పరిక్షించుకుంటున్నారు. ఇండియన్ క్రికెట్ లో మెజార్టీ అసోసియేషన్స్ లో ఆయన మద్ధతుదారులే ఉన్నారు. ఫిక్సింగ్ ఆరోపణలతో బీసీసీఐలో ఆయన ఒంటరయ్యారు. దాంతో ఓడకుండానే పదవినుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆయనకు ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ లేదు. అయితే తనకు నమ్మకస్తులైన అమితాబ్ చౌదరినో, అనిరుధ్ చౌదరినో అందులో కూర్చోబెట్టాలన్నది శ్రీని ప్లాన్. ప్రెసిడెంట్ పదవి తమకే కావాలని పట్టుబడితే… ఈస్ట్ జోన్ కే చెందిన అమితాబ్ చౌదరిని రంగంలోకి దింపాలన్నది ఓ స్ట్రాటజీ. అందుకే బెంగుళూరులో తనకు అనుకూలంగా ఉన్న అసోసియేషన్ మెంబర్స్ తో శ్రీని సీక్రెట్ మీటింగ్ పెట్టినట్టు తెలుస్తోంది. దాంతోపాటు బీసీసీఐ మాజీ బాస్ శరద్ పవార్ ని కలిసారని సమాచారం. తనకు అన్నిరకాలుగా అడ్డొస్తున్న శశాంక్ మనోహర్ ని కంట్రోల్ చేయాల్సిందిగా పవార్ ని… శ్రీని కోరినట్టు క్రికెట్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక పవార్ కూడా బీసీసీఐ చీఫ్ పోస్ట్ పై కన్నేసినట్టు తెలుస్తోంది. అందులోభాగంగానే శ్రీనితో పవార్ మంతనాలు సాగించారన్నది మరో ఆర్య్గుమెంట్. ఇక శ్రీని, పవార్ సంగతిలా ఉంటే… మరోవైపు రాజీవ్ శుక్లాని బోర్డ్ ప్రెసిడెంట్ ను చేసేందుకు అనురాగ్ ఠాకూర్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈస్ట్ జోన్ తో పాటు మరికొన్ని సంఘాలతో ఠాగూర్ తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయంగా ఇద్దరూ వేర్వేరు పార్టీలే అయినా… పవార్, శ్రీనిల పెత్తనం సాగకుండా అడ్డుకోవాలంటే శుక్లానే కరెక్ట్ అన్నది ఠాగూర్ వర్గం ఆలోచన. అందుకే శుక్లాకు మద్ధతు కూడగట్టేందుకు సీక్రెట్ గా చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి పవర్ పాలిటిక్స్ కు బీసీసీఐ మరోసారి వేదికైంది. ప్రెసిడెంట్ పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తుండటంతో క్రికెట్ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. వచ్చే నెల 2న జరిగే దాల్మియా సంతాపసభ తర్వాత… పోటీలో ఎవరెవరుంటారనే దానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.

bcci_logo-640x480

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy