బీసీ కమిషన్ విధివిధానాలు ఖరారు చేసిన ప్రభుత్వం

bcబీసీ కమిషన్ విధివిధానాలు ఖరారు చేసింది సర్కార్. ఇందులో భాగంగానే ఈరోజు  జీవో కూడా  విడుదల చేసింది. బీసీలో సామాజిక, ఆర్థిక, విద్య స్థితిగతుల మీద అధ్యయనం చేయాలని సూచించింది. బీసీల్లో బాగా వెనకబడిన, సంచార జాతుల జీవితాలు, వారి పరిస్థితుల మీద కూడా స్టడీ చేయాలని చెప్పింది ప్రభుత్వం. ఈ మొత్తం సమగ్ర అధ్యయనం చేసి 6నెలల్లో నివేదిక ఇవ్వాలని కోరింది. కమిషన్ నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లు పెంపుమీద నిర్ణయం తీసుకోనుంది సర్కార్.

బీసీ కేటగిరీల్లో ముస్లిం వాటా కాకుండా నాలుగు కేటగిరీలుగా రిజర్వేషన్లు ఉన్నాయి.  ఇందుల BC-A  7 శాతం, BC-B 10శాతం, BC-C 1 శాతం, BC-D 7శాతం మొత్తంగా 25శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.. ఇక సమగ్ర కుటుంబ సర్వే ప్రాతిపాదికన రాష్ట్రంలో ఉన్న మొత్తం బీసీలు 52శాతం, రాష్ట్రంలో అధికంగా ఉన్న తమకు జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతున్నాయ్ బీసీ సంఘాలు. అయితే ప్రభుత్వం మటుకు 25 నుంచి 33శాతానికి పెంచేలా ఆలోచన చేస్తోంది.

ఇప్పటికే బీసీ కమిషన్  రిజర్వేషన్లు పెంపు మీద గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసింది. పక్క రాష్ట్రాల్లో  రిజర్వేషన్లు అమలుతీరుపై  గతంలో బీసీ కమిషన్లు ఏయేవిషయాలపై దృష్టిపెట్టి, అధ్యయన సమయంలో ఏయే విషయాలపై  పరిశీలించాలనే దానిపై నజర్ పెట్టింది. దీని ఆధారంగానే బీసీల ఆర్థిక స్థితి, సామాజిక విద్య, సంక్షేమం, మౌలిక సదుపాయాల వివరాలు, ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో ఉద్యోగాలు ఎలా ఉన్నాయ్, జీవనోపాధి సంగతి అన్న వివరాలు పరిశీలించి, సర్కార్ కు రిపోర్టు ఇస్తుంది బీసీ కమిషన్. ఇందుకు గాను యూనివర్సిటీల్లో వెనుకబడిన వర్గాల మీద చేసిన రిపోర్టులు, దేశంలోనే మొదటి సారిగా బీసీల జీవితాలపై అధ్యయనం చేసిన  కాలేష్కర్ కమిషన్  , మండల్ కమిషన్ తో పాటు అనంతరాములు, మురళీధర్ రావుల నివేదికలు తమిళనాడులో రిజర్వేషన్ల పెంపు, ఇతర అంశాల వివరాలను పరిశీలిస్తుంది బీసీ కమిషన్.

బీసీ కులాలమీద అధ్యయనం చేయాలని కమిషన్ కు ఇప్పటికే కులసంఘాలనుంచి వినతులు కూడా వచ్చాయ్ . ఇంతలోనే సర్కార్ నుంచి ఆదేశాలు రావడంతో నేరుగా గ్రామాల్లోకి వెళ్లి.. పరిశీలన జరపనున్నారు బీసీ కమిషన్ సభ్యులు. మొన్న గిరిజనులు, ముస్లింలకు రిజర్వేషన్ల  పెంపు సమయంలో చెప్పినట్లుగా శనివారం బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు చర్యలు ప్రారంభించింది ప్రభుత్వం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy