బీహారీలు ఎటువైపు..?

url4నెక్ టు నెక్. టగ్ అఫ్ వార్. ఎవరు గెలిచినా .. మెజారిటీ ఐదారు సీట్లే. అధికారంలోకి రావడానికైనా … అధికారం చేజార్చుకోవడానికైనా … ఆ కొన్ని సీట్లే కీలకం. బీహార్ పోల్ ప్రొజెక్షన్ … పార్టీలను కన్ ఫ్యూజ్ చేస్తోంది. జనానికే  కాదు సర్వేలకూ అంతుచిక్కట్లేదు బీహార్ ఎన్నికల చిత్రం. ఫస్ట్ ఫేజ్ పోల్ కు ఓటర్లు రెడీ అయిన టైంలో … ప్రీ పోల్ సర్వేలు ఏమంటున్నాయో చూద్దాం.

ప్రధాని మోడీ ఏడాదిన్నర పాలనకు ప్రోగ్రెస్ రిపోర్ట్. సీఎం నితీష్ కుమార్ పనితీరుకు ఓటర్లిచ్చే తీర్పు. అందుకే దేశం మొత్తం ఇపుడు బీహార్ వైపే చేస్తోంది. ఐదు దశల్లో జరగనున్న ఎన్నికల్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ ప్రచారం ముగిసింది. ఈ నెల 12 న మొదటి దశకు సర్వం సిద్ధమైంది. అయితే బీహారీలు ఈసారి ఎటువైపు మొగ్గుతారనేది ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోడీ లక్షా 65 వేల కోట్ల ప్యాకేజీకి ఫ్లాట్ అయ్యారా? లేక గూండా రాజ్ ముద్రను దూరం చేసి అభివృద్ధి వైపు నడిపించిన నితీష్ కు … మళ్లీ పట్టంకడతారా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. మొదటి దశ ఎన్నికలు మొదలవుతున్న టైంలో … ప్రీ పోల్ సర్వే రిజల్ట్స్ మిక్స్డ్ గా వచ్చాయి. ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే ప్రకారం .. ఎన్డీయే 43 శాతం ఓట్లతో 119 సీట్లు, నితీష్ అధ్వర్యంలోని గ్రాండ్ అలయన్స్ కు 41 శాతం ఓట్లతో 116 సీట్లు వస్తాయని అంచనా. ఇతరులకు ఎనిమిది సీట్లొచ్చే ఛాన్సుంది. 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 122 సీట్లు. ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే ప్రకారం ఏ కూటమికీ స్పష్టమైన అధిక్యత వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

_2aed0064-6d7f-11e5-a9e2-597b09296f58ఇక సీఎన్ఎన్ ఐబీఎన్-యాక్సిస్ కంబైన్డ్ సర్వేలో గ్రాండ్ అలయన్స్ కు స్పష్టమైన అధిక్యతనిచ్చారు ఓటర్లు. 46 శాతం ఓట్లతో గ్రాండ్ అలయన్స్ కు 137 సీట్లొస్తాయన్నది ఈ సర్వే అంచనా. జేడీయూకు 69 సీట్లు, లాలూ ఆర్జేడీకి 48 సీట్లు, కాంగ్రెస్ కు 20 సీట్లు రావొచ్చని అంచనా వేసిందీ సర్వే. ఇక 38 శాతం ఓట్లతో బీజేపీ కూటమికి 95 సీట్లు రావొచ్చంటోంది ఐబీఎన్-యాక్సిస్ సర్వే. బీజేపీకి సోలోగా 82 సీట్లు, రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీ ఎల్జేపీకి రెండు సీట్లు, రాం మాంఝీ పార్టీకి మూడు సీట్లు రావొచ్చని అంచనా వేసింది సర్వే. బీహార్ సీఎంగా నితీష్ కు 38 శాతం ఓటర్లు పట్టంకట్టారు. నిజానికి నెలరోజుల క్రితం సర్వేలతో పోలిస్తే నితీష్ గ్రాఫ్ భారీగా పెరిగింది. గత సర్వేల్లో నితీష్ కు 29 శాతం ఓటర్లు ఓకే చెప్పారు. ఇపుడాయన గ్రాఫ్ 38 శాతానికి పెరిగింది. ఇక బీజేపీ నేతృత్వంలో సుశీల్ కుమార్ మోడీకి 29 శాతం మంది ఓటర్లు ఓకే చెప్పారు. సీఎంగా లాలూ గ్రాఫ్ 12 శాతం నుంచి 9 శాతానికి పడిపోయింది. అయితే లాలూతో టై అప్ అవడం నితీష్ కు ప్లస్ అయిందంటున్నాయి సర్వేలు. సేమ్ టైం … బీజేపీకి ఎల్జేపీ, మాంఝీ పార్టీలతో పెద్దగా ఒరిగిందేం లేదన్నది సర్వేల సారాంశం. మొదటి దశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఫస్ట్ ఫేజ్ లో పది జిల్లాల్లో 49 సీట్లకు పోలింగ్ జరగబోతోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy