బీహార్‌ ప్రయోజనాల కోసమే రాజీనామా: నితీష్ 

nihehబీహార్‌ ప్రయోజనాల కోసమే రాజీనామా చేశానన్నారు నితీష్‌కుమార్‌. గవర్నర్‌ను కలిసి సీఎం పదవికి రాజీనామా లేఖ సమర్పించానని తెలిపారు. తాను ఎవరినీ రాజీనామా చేయాలని అడగలేదన్నారు. నీతి వంతమైన పాలన అందించడానికి ప్రయత్నించానని..అయితే అది సాధ్యం కాలేదన్నారు.

ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల మధ్య కలిసి పని చేయడం కష్టతరంగా మారిందన్నారు. సంకీర్ణ ధర్మాన్ని పాటించేందుకు చివరి క్షణం వరకు ప్రయత్నించాన్నారు. సంకీర్ణ భాగస్వామి కాంగ్రెస్ పార్టీతో కూడా చర్చించానని… రాహుల్ గాంధీతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడినట్లు నితీష్ తెలిపారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా.. సమస్య పరిష్కారం కాలేదని… ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడిపించేందుకు నా అంతరాత్మ అంగీకరించలేదని అందుకే రాజీనామా చేశానని తెలిపారు. ప్రభుత్వాన్ని నడపగలిగినంతకాలం నడిపా…. ఇక ప్రభుత్వాన్ని నడపటం నావల్ల కావటం లేదన్నారు. నీతి నిజాయితీతో కూడిన రాజకీయాలను నమ్మినవాడినన్న నితీష్… చివరిక్షణం వరకు నీతి నిజాయితీతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉంటానని తేల్చి చెప్పారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy