బీహార్‌ లో మరో ట్విస్ట్‌ : JDUలో ఎమ్మెల్యేల తిరుగుబాటు 

Nitish-Sharadబీహార్‌ రాజకీయాల్లో మరో ట్విస్ట్‌ బయటకొచ్చింది. నితీశ్‌ విశ్వాస పరీక్షకు ముందు JDUలో లుకలుకలు బయటపడ్డాయి. JDUలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు. రాహుల్‌గాంధీని జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్‌ కలిశారు.

ఆర్జేడీ.. కాంగ్రెస్ స్నేహ హస్తాలను వదులుకొని, బీజేపీతో పొత్తు పెట్టుకున్న నితీశ్ కుమార్‌కు అసమ్మతి సెగ తగులుతున్నట్లు సమాచారం. JDU కీలక నేత శరద్ యాదవ్… కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో జవహర్ భవన్‌లో సమావేశమయ్యారు. JDU-BJP  మైత్రిని కొందరు JDU ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తమ పార్టీ సమైక్యంగా ఉందని JDU ప్రకటించింది.

కేరళ జేడీయూ శాఖ కూడా… నితీశ్ కుమార్ బీజేపీతో చేతులు కలపడాన్ని తీవ్రంగా ఖండించింది. జేడీయూతో సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు  ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వీరేంద్ర కుమార్ తెలిపారు. ఫాసిస్టు శక్తులతో పోరాటానికి ఎంత మూల్యాన్ని చెల్లించడానికైనా వెనుకాడేది లేదన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy